2016 – Gurupoornima

ఓంశ్రీసాయిరాం

దత్తసాయి భక్తులందరికి ప్రత్యేక ఆహ్వనము
ఏకాదశ సంవత్సరపు శ్రీగురు పూర్ణిమ
ఆహ్వాన మహోత్సవ కార్యక్రమము-2016

శ్రీదత్తాత్రేయులవారి కృపా కటాక్షవీక్షణములవలన, ఇప్పటికి à°—à°¤ పది వసంతముల నుండి శ్రీ గురుపూర్ణిమ మహోత్సవ కార్యక్రమమును పుణ్యభూమిగా పిలువబడుతున్న మహారాష్ట్రరాజ్యంలోగల శివగ్రామం (నేడు శేగాఁవ్, బుల్డానా-జిల్లా)లో à°ˆ సంవత్సరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుటకు శ్రీ దత్తాత్రేయులవారి ఆదేశాను సారము ఆషాఢ శుద్ధ పౌర్ణమి మంగళవారము (త్రిదిన – అనగా 17-07-2016 నుండి 19-07-2016 వరకు) జరుపబడును.

పుణ్యభూమి యాత్రలోదర్శనీయ స్థలాలు

17-07-2016 భానువారము :

i) శేగాఁవ్ (శ్రీగజానన మహారాజువారి సమాధి మరియు సంస్థాన సందర్శనం) (www.gajananmaharaj.org),

ii) నందూర, బుల్డానా-జిల్లా (ప్రపంచములో గల ఐదవ ఎత్తైన హనుమంతులవారి విగ్రహం, 105 అడుగులు-www.ramhanuman.in/statue/tallest-hanuman-idol5.html),

iii) శ్రీ గులాబ్ బాబావారి సమాధి దర్శనం టేఖర్ కేడా గ్రామం (అమరావతి-జిల్లా-www.santgulabbaba.com),

iv) మరియు ఆనందసాగర్, షేగాఁవ్ (www.gajananmaharaj.org/anandsagarenglish).

18-07-2016 సోమవారము :

i) శ్రీ సారంగధర (బాలాజీ) మందిరము, మేహాకర్ (www.balajitemplemehkar.com),

ii) మాహూర్ ఘఢ్, నాందేడ్ జిల్లాలోగల శ్రీరేణుకా మాత మందిరము (అష్టాదశ శక్తిపీఠాలలో ఎనిమిదవ పీఠము www.shreerenukamatamandir.org),

iii) దత్తఘఢ్, అనసూయఘఢ్ (త్రిమూర్తుల జన్మస్థానము)

iv) శ్రీదత్తాత్రేయులవారి నిద్రా స్థానము దేవదేవేశ్వర మందిరము (www.sripadavallabha.org/sv/sri-deva-deveshwara-mandiram),

v) శరభంగముని ఆశ్రమము, ఉంకేశ్వర్, కిన్వట్ (www.sharabhanghashram.com)

vi) కారంజా నగరము, వాషిం జిల్లా (శ్రీదత్తాత్రేయులవారి ద్వితీయ పూర్ణావతారం-శ్రీనరసింహ సరస్వతివారి జన్మస్థానము) (www.gurumandir.org)

19-07-2016 మంగళవారము : శ్రీ గురు పూర్ణిమ : శేగాఁవ్ (శ్రీగజానన మహారాజువారి సమాధి మరియు సంస్థాన సందర్శనం) మరియు శ్రీ గురు పూజా మహోత్సవం.

యాత్రకు సంబందించిన పూర్తి వివరాలకు సంప్రదించవలసిన వారు :

శ్రీ సి.హెచ్. డేవిడ్ రాజు,
హైదరాబాద్ (040 2718 4398) మరియు 09573962042;
Email : cdraaju1866@yahoo.co.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  • Services

    Free Food Packets Served to Needy poor, road side beggars at their doorsteps with out any discrimination of caste and creed.
    To aid giving scholarship, donations, fees to orphan and poor children irrespective of Caste, Place, Color or Community.
  • Videos